Friday, April 18, 2014

Gabriel García Márquez


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -నోబెల్‌ గ్రహీత గాబ్రియెల్‌ గార్షియా మార్క్వెజ్‌- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


 ప్రఖ్యాత స్పానిష్‌ రచయిత, నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత గాబ్రియెల్‌ గార్షియా మార్క్వెజ్‌ 17 -04-2014 న కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. లాటిన్‌ అమెరికా సమాజానికి చెందిన పలు కోణాలను ప్రపంచం ముందు ఆవిష్కరించిన మార్క్వెజ్‌ను మార్క్‌ ట్వైన్‌, చార్లెస్‌ డికెన్స్‌ తదితర ప్రముఖ రచయితల సరసన చేరుస్తారు అభిమానులు. సాహితీ ప్రపంచం గాబొ అని ప్రేమగా పిలుచుకునే మార్క్వెజ్‌ కొలంబియాలో పుట్టిపెరిగారు. ఆయన రాసిన 'వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌' అనే రచన 25 భాషల్లోకి అనువదితమవడమే కాక 50 మిలియన్‌ ప్రతులకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. సెర్వాంటిస్‌ 'డాన్‌ క్విక్జోట్‌' తర్వాత స్పానిష్‌ చరిత్రలో అంతగొప్ప నవల మళ్లీ ఇదేనని విమర్శకులు ప్రశంసించారు. ఈ నవలకే నోబెల్‌ బహుమతి కూడా లభించింది.
 • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

Friday, April 19, 2013

Sir Arthur Cotton,సర్‌ ఆర్థర్‌ కాటన్‌


 •  

 •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -సర్‌ ఆర్థర్‌ కాటన్‌ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

మే 15వ తేదీ 1803లో జన్మించిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తిచేసి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేశాడు. అందుకే ఆయనను ఆంధ్రులు మరచిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపర భగీరథుడిగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ.

For more details -> Sir Arthur Cotton in Telugu
 • ==========================
 Visit my website - > Dr.seshagirirao.com/

Wednesday, January 30, 2013

Che Guevara,చే గువేరా

 •  
 •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Che Guevara,చే గువేరా - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....స్

 ఏర్నెస్టో "చే" గువేరా  సాధారణంగా చే గువేరా , ఎల్ చే , లేదా మామూలుగా చే అని పిలువబడతారు, ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, మరియు క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి.

పూర్తి వివరాలకు : Che Guevara,చే గువేరా
 • =============================
 Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, January 7, 2012

కారల్‌ మార్క్స్ ‌, Carl Marx • image source : Wikipedia.org

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - కారల్‌ మార్క్స్ ‌, Carl Marx- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


కారల్‌ మార్క్స్‌ మే 5, 1818వ సంవత్సరంలో కారల్‌ మార్క్స్‌ జర్మనీలోని యూదు కుటుంబంలో జన్మించాడు. 1841 తరువాత లుడ్విగ్‌ ఫొయెర్‌ బ్యాక్‌ ప్రభావంతో భౌతికవాదిగా మారాడు. పారిస్‌లోని విప్లవోద్యమంలో పాల్గొన్నాడు. జర్మనీ మార్క్స్‌ను దేశం నుండి బహిష్కరించింది. 1845లో ఫ్రాన్స్‌ కూడా మార్క్స్‌ను వెలివేసింది. తరువాత మార్క్స్‌ బెల్జియం వెళ్లాడు. పాత సోషలిస్ట్‌ సంస్థలన్నీ కలిసి 1847 లో ‘కమ్యూనిస్ట్‌ లీగ్‌’గా ఏర్పడ్డాయి. ఎంగెల్స్‌తో కలిసి ఆ సంస్థకు ఎజెండాగా 1848 నాటికి కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఫ్రాన్స్‌, జర్మనీల్లో రాచరికాల మీద తిరుగు బాట్లు పెల్లుబికాయి. బెల్జియం కూడా మార్క్స్‌ ను దేశం నుంచి బహిష్కరించింది. చివరకు మార్క్స్‌ లండన్‌ చేరుకుని 1859లో ‘ఆర్థిక శాస్త్ర విమర్శ’ అనే గ్రంధాన్ని రాశాడు. ‘పెట్టుబడి’ (క్యాపిటల్‌) నాలుగు భాగాలుగా రచించాడు. 1864లో మార్క్స్‌ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌) ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాలు పెంపొందించడానికి దోహదం చేశాడు. మార్చి 14, 1883న మార్క్స్‌ మరణించాడు

For full details ... see Wikipedia.org కారల్‌ మార్క్స్ ‌, Carl Marx
 • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Friday, October 7, 2011

కంప్యూటర్‌ మాంత్రికుడు స్టీవ్స్‌జాబ్స్‌..,Steve Jobsమానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ ---కంప్యూటర్‌ మాంత్రికుడు స్టీవ్స్‌జాబ్స్‌-Steve Jobs--- - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


(February 24, 1955 – October 5, 2011)

* ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టిన ఐఫోన్‌ సృష్టికర్త మరణం--కంప్యూటర్‌ మాంత్రికుడు, ఐఫోన్‌ సృష్టికర్త, యాపిల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్స్‌జాబ్స్‌(56) ఇకలేరు. 2004 నుంచి ఉదర సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్న స్టీవ్స్‌ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఐఫోన్‌ 4ఎస్‌ విడుదలైన మరుసటి రోజే స్టీవ్స్‌ మరణం కంప్యూటర్‌ ప్రపంచాన్ని కలచివేసింది.

సిలికాన్‌ వ్యాలీ దిగ్గజం
స్టీవ్‌జాబ్స్‌... అధునాతన కంప్యూటర్‌ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి. కంప్యూటర్‌ రంగంలో తనదైన ముద్రవేసి సిలికాన్‌ వ్యాలీ దిగ్గజంగా ఖ్యాతికెక్కారు. 1955 ఫిబ్రవరి 24న శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించిన జాబ్స్‌ను పాల్‌, క్లారా జాబ్స్‌ దంపతులు దత్తతకు తీసుకున్నారు. కళాశాల విద్యాభ్యాసాన్ని జాబ్స్‌ మధ్యలోనే వదిలిపెట్టాడు. అనంతరం ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తితో వాటిపై అధ్యయనం చేశాడు. భారతీయ ఆధ్యాత్మికత, హరేరామ హరేకృష్ణ ఉద్యమంపై జాబ్స్‌కు ఆసక్తి ఎక్కువ. దీని కోసం ఆయన భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలు సందర్శించాడు. అనంతరం అమెరికాకు తిరిగివెళ్లి స్నేహితులు స్టీవ్‌వొజ్‌నిక్‌, రొనాల్డ్‌ వేన్‌లతో కలిసి ఆపిల్‌ కంపెనీని నెలకొల్పాడు. తరువాత ఆపిల్‌ నుంచి తప్పుకున్న జాబ్స్‌ లారెన్‌ పోవెల్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆపిల్‌ నుంచి వెళ్లిన తరువాత నెక్ట్స్‌ అనే కంపెనీని స్థాపించాడు. కొద్దికాలానికే నెక్ట్స్‌ను ఏపిల్‌ కొనుగోలు చేయడంతో మాతృ సంస్థలోకి జాబ్‌ తిరిగివచ్చాడు. ఐపాడ్‌, మాకింటోష్‌ సిస్టమ్స్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌... తదితర అధునాతన ఆవిష్కరణలను సృష్టించాడు.
ముప్పైఏళ్ల ముందు కంప్యూటర్లు పెద్దవిగా చాలా తక్కువ స్టోరేజీతో ఉండేవి. అలాంటి సమయంలోనే జనవరి 24 1984లో స్టీవ్‌జాబ్స్‌ ఏపిల్‌ కంప్యూటర్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. మేకింటోష్‌ ఆపరేటింగ్‌పై నడిచే ఏపిల్‌ పీసీ కంప్యూటర్‌ ప్రపంచంలో ఒకనూతనశకానికి నాం దిపలికింది. అనంతరం జాబ్స్‌ పరిచయం చేసిన ఐపాడ్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌, ఐట్యూన్స్‌ ... తదితర ఆవిష్కరణలు సాంకేతిక ప్రపంచంలో ఎన్నో మార్పులకు తెర తీశాయి. నానో టెక్నాలజీని ఉపయోగించి తక్కువ బరువు, ఎక్కువ స్టోరేజీతో ఉన్న ఫోన్లు, ఐపాడ్‌ షఫిల్‌ ఆపిల్‌ కంపెనీకి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

టచ్‌స్క్రీన్‌ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన ఐఫోన్లు ప్రపంచంలో ఎన్నో అధునాతన స్మార్ట్‌ ఫోన్లకు మార్గదర్శకంగా నిలిచింది. స్మార్ట్‌ ఫోన్ల శకం ఇక్కడి నుంచే ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఐప్యాడ్‌ టాబ్లెట్‌ పీసీ మరో నూతన టెక్నాలజీ శకానికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌ ఫోన్‌ కంటే పెద్దదిగా లాప్‌ట్యాప్‌ కంటే చిన్నదిగా టచ్‌ టక్నాలజీతో తయారు చేసిన ఐప్యాడ్‌ టాబ్లెట్‌ పీసీల చిత్రాన్ని సమూలంగా మార్చివేసింది. 3జీ సౌకర్యంతో పాటు ఫోన్‌, కంప్యూటర్‌గా పనిచేయగల సామర్థ్యమున్న ఈ టాబ్లెట్‌ పీసీల చుట్టే సమకాలీన ప్రపంచం తిరుగుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
56 ఏళ్ల జాబ్స్‌ గత కొంతకాలంగా ఉదరకోశ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టులో ఆయన ఏపిల్‌ సీఈవో పదవీ బాధ్యతల నుంచి తప్పుకొని సహచరుడు టిమ్‌కుక్‌ను నియమించారు.
* 'స్టీవ్స్‌ లేరన్న విషయాన్ని వెల్లడించడానికి ఎంతో చింతిస్తున్నాం, ఇది కేవలం ఒక్క యాపిల్‌ సంస్థకే కాదు.. యావత్‌ ప్రపంచానికి మింగుడు పడని వార్త. ఓ సృష్టికర్తను మనం కోల్పోయాం. -యాపిల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైర్టక్టర్స్‌.
* కుటుంబం పట్ల జాబ్స్‌కు ప్రత్యేక అభిమానం, ఆప్యాయతలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న స్టీవ్స్‌ కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు- జాబ్స్‌ కుటుంబం
* జాబ్స్‌ కంప్యూటర్‌ రంగంలో నవకల్పనలకు ఆద్యుడు. ప్రపంచం ఓ సృజనశీలుడ్ని కోల్పోయింది.- ప్రధాని మన్మోహన్‌
* స్టీవ్‌ మంచి స్నేహితుడు, గట్టి పోటీదారు, ఆయన మరణించాడన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.-బిల్‌గేట్స్‌

-- Eenadu news paper 07/10/2011
 • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Monday, September 26, 2011

చార్లీ చాప్లిన్‌ , Charlie Chaplinచార్లీ చాప్లిన్‌ హాస్యనటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప నటుడు చార్లీ చాప్లిన్‌. ఏప్రిల్‌ 16, 1889న జన్మిం చారు. ఈయన హాస్యపు తెరల వెనుక విషాదం తొంగి చూస్తూ ఉంటుంది. హాలీవుడ్‌ రూపురేఖలు దిద్దిన మహానటుల్లో చార్లీ చాప్లి న్‌ ఒకరు. జన్మతః బ్రిటీష్‌ వాడైనప్పటికీ అమె రికా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవించిం ది. 1952 ప్రాంతంలో అమెరికాను వదిలి పెట్టి స్విట్జర్లాండ్‌లో స్థిరపడాల్సి వచ్చింది. పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరి కత లో సమాన్య
మానవుని ఆవేదనను తన చిత్రాలలో అంతర్లీనంగా ప్రదర్శించాడు. కిడ్‌, లైమ్‌ లైట్‌, సిటీ లైట్స్‌, ది గ్రేట్‌ డిక్టేటర్‌, మోడర్న్‌ టైమ్‌ మొదలైనవి ఆయన ప్రసిద్ధ చిత్రాలు.

పూర్తి వివరాలకోసం --> చార్లీ చాప్లిన్‌ , Charlie Chaplin

 • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

Saturday, September 24, 2011

హెన్రీ ఫోర్డ్ . Henry Ford cప్రముఖ అమెరికా వ్యాపారవేత్త . ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు , కంపెనీ అధినేత . ఈయన ప్ర్పంచ ధినికులలో ఒకరు . ఈయన 30 జూలై 1863 న మిచిగాన్‌ టౌన్‌ , అమెరికాలో జన్మించారు . ఈయన తండ్రి విలియం ఫోర్డ్ ఇంగ్లండ్ నుండి అమెరికా వలస వచ్చారు . హెన్రీ తల్లి మేరీ లిగాట్ ... మిచిగాన్‌ వాస్తవ్యరాలు .

అక్టోబర్ 1, 1908 ఇప్పుడు యావత్ ఆటోమొబైల్ రంగాన్ని ఓ ఊపుతున్న ఫోర్డ్ కార్ల కంపేనీ నుండి ఓ అందమైన కారు పుట్టినరోజు. ఆ కారే ఫోర్డ్ మోడల్ టి. దీనిని పుట్టిన రోజునాడు హెన్రీ ఫోర్డ్ మాట్లాడుతూ ఈ కారు మీకు ఏకలర్ లో కావాలంటే ఆకలర్ లో లభ్యం అవతుందని కొన్ని సంవత్సరాల క్రితం ఆయన అన్నారు. ఈ కారు ప్రపంచానికి మేము అందిస్తున్న ఓ అందమైన గిప్ట్ గా అభివర్ణంచారు. దీనితో పాటు ఈ కారు యావత్ ఆటో మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని అన్నారు.

ఆ రోజుల్లో ఈ కారు సృష్టించినటువంటి హాడావుడి అంతా ఇంతా కాదు. హెన్రీ ఫోర్డ్ ఈ కారుని ముద్దుగా టిన్ లిజ్జి అని పిలచేవారు. ఈకారు పెద్దవాళ్శకి మాత్రమే కాకుండా మిడిల్ క్లాసు ఫ్యామిలి వాళ్శు కూడా కోనుగోలు చేసే విధంగా దీని ధర నిర్ణయించడం జరిగింది. ఆ రోజుల్లో ఈ కారుని చాలా అత్యాధునిక టెక్నాలజి ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఈ కారులో నాలుగు సిలిండర్స్, మాగ్నటో ఇజినేషన్ తో పాటు ప్లానిటరి ట్రాన్సిమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

అక్టోబర్ 1, 1908వ రోజున ఈకారుని విడుదల చేసిన తర్వాత యావత్ ప్రపంచం మొత్తం ఈ కారుపై వాళ్శ దృష్టిని నిలపారు. అంతేకాకుండా ఈ కారు రికార్డ్ సృష్టిస్తూ అమ్మకాలు నమోదుచేసిందని తెలిపారు. ఈ కారు డిమాండ్ కూడా అంతలా సాగింది. ఈ డిమాండ్ ని చూసినటువంటి హెన్రీ ఫోర్డ్ 1913 లో ఇంకోక సరిక్రోత్త కారు మోడల్ టి ప్లాంట్ ని విడుదల చేశారు. పూర్వం ఓ కారుని తయారుచేయడానికి 728మినిట్స్ పట్టేదని, కాని ఇప్పుడు ఇదేకారుని ప్రోడ్యూస్ చేయడానికి 93మినిట్స్ పడుతుందని అన్నారు. ఫోర్డ్ మోడల్ టి కారు యొక్క ఖరీదు అక్టోబర్ 1, 1908నాడు $1000 గా ఉండేదని తర్వాత 1927లో దాని ఖర్చు $300కి తగ్గించడం జరిగిందన్నారు. ఈ కారు ఖరీదు తక్కువ మాత్రమే కాకుండా టెక్నాలజీ పరంగాకూడా బాగా డిమాండ్ ని సాధించిందని తెలిపారు.

ఒక పెద్ద కంపెనీకి అధిపతి తమ కార్యాలయాన్ని సందర్శించడానికి వస్తున్నాడు. అందరూ అటెన్షన్‌గా తమ పని తాము చూసుకుంటున్నారు. యజమాని తమ డెస్క్‌కి దగ్గరగా వచ్చినపుడు చిరునవ్వుతో విష్ చేస్తున్నారు. అలా ఆయన నెమ్మదిగా ఆయన గది వైపు సాగిపోతున్నాడు. ఆయనను చూసిన అందరూ పైకి లేచి విష్ చేశారు ఒక్కరు తప్ప. ఆ ఒక్కడు ఒక్క క్షణం యజమాని వైపు తలెత్తి చూసి కళ్ళతోనే విష్ చేసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు.

యజమాని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. అక్కడి ఆఫీస్ హెడ్ ను తన గదికి పిలిపించాడు.
“ఫైర్ హిమ్ ఇమ్మీడియట్లీ” ఆజ్ఞాపించాడు వెంటనే.
“సర్ అదీ….. అతను….” అంటూ నీళ్ళు నమిలాడు ఆఫీస్ హెడ్డు.
“నాకింకేమీ చెప్పద్దు… ముందతన్ని ఉద్యోగం నుంచి తీసేయండి. యజమానికి కనీస మర్యాద ఇవ్వలేని వాడికి ఇక్కడ పనిచేసే అర్హత లేదు” అన్నాడు.
మారుమాట్లాడలేదు ఆఫీస్ హెడ్డు. అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు.

కొద్ది రోజులు గడిచాయి. యజమాని ఆ సంఘటన గురించి పూర్తిగా మరిచిపోయాడు. ఆయనకు ఆఫీస్ సక్రమంగా నడుస్తున్నట్లు కనిపించలేదు. వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాడు.
“ఇప్పటి దాకా బాగా నడుస్తున్న ఆఫీసులో అకస్మాత్తుగా ఈ పరిణామాలేంటి?” అని ప్రశ్నించాడు.
“మన ఆఫీసులో పనిచేసే ఒక ప్రతిభావంతమైన ఉద్యోగిని మీరు కొన్ని రోజుల క్రిందటే బాధ్యతల నుంచి తొలగించారు.” అన్నాడు ఒక అధికారి.
“ఎందుకు తొలగించాము?” అని ఎదురు ప్రశ్నించాడు ఆ అధికారిని.
“మీరు ఆఫీసుకు వచ్చినపుడు అతను పైకి లేచి విష్ చేయలేదు, అందుకని…” సమాధానమిచ్చాడా అధికారి.
” మరి అలా చేయడం క్రమశిక్షణారాహిత్యం కాదా?”
“కాదు సర్. ఎందుకంటే అతనికి రెండు కాళ్ళు లేవు.“
యజమాని గుండె కలుక్కుమంది.
“మరి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?” ప్రశ్నించాడు.
“మీరు తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పే స్వేచ్ఛ మాకు లేదు కదా సర్!”

“సరే జరిగిందేదే జరిగిపోయింది. నేను వెళ్ళి అతన్ని మళ్ళీ ఈ ఉద్యోగంలోకి రమ్మని కోరతాను” అని చెప్పి అతని చిరునామా సేకరించి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి అతను తన చుట్టూ నలుగుర్ని కూర్చుండబెట్టుకుని వాళ్ళకు ఏదో చెబుతున్నారు. తన మాజీ యజమానిని కళ్ళతోనే పలకరించాడు. వచ్చిన పని ఏంటని అడిగాడు. జరిగిందానికి తాను చాలా చింతిస్తున్నానీ, దయచేసి మళ్ళీ విధుల్లో చేరాల్సిందిగా కోరాడు.

“నన్ను క్షమించండి. ముందు వెనకా ఆలోచించకుండా నిర్ణయాలు తోసుకునే బాస్ క్రింద నేను పనిచేయలేను. నేను పడ్డ అవమానాలు నాలాంటి వికలాంగులు పడకూడదనే నాకు వీలైనంతో కొద్ది మందిని చేరదీసి శిక్షణ ఇస్తున్నాను. నా జీవితానికి ఇది చాలు” అన్నాడు.

భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడా యజమాని. చాలాసేపు ఆలోచించాడు. మరుసటి రోజు నుంచీ తన పద్దతుల్లో మార్పు తెచ్చుకున్నాడు. తన ఉద్యోగులకి పూర్తి స్వేచ్చనిచ్చాడు. తన కంపెనీని విజయ పథంలో నడిపాడు. ఆయన ఎవరో కాదు. ఫోర్డ్ మోటార్స్ అధినేత హెన్రీ ఫోర్డ్


 • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/