Saturday, September 24, 2011

ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ ,Alfred Nobel



  • డైనమైట్‌ను కనుగొని మానవాళికి ఎంతో మేలు చేకూర్చుని ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌. ఆల్ ఫ్రెడ్ నోబెల్,AlfredNobel. జననం అక్టోబర్ 21, 1833 న స్వీడన్ స్టాక్‌హోం, స్వీడన్ లో. మరణం డిసెంబర్ 10, 1896.



ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
  • జీవితం

ఆల్ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు. తరవాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.

  • Source : courtesy with Wikipedia.org/

2 comments:

  1. అనుమతి లేకుండా మీరు నా బ్లాగు నుంచి సమాచారం సేకరించినట్లు ఇప్పడే గమనించాను. దయచేసి ఆ సమాచారం తొలగించండి. ఇక ముందు నా బ్లాగు సమాచారం కాపీ చేయరాదని మనవి.

    ReplyDelete
  2. CCKrao ... your matter removed at your wish . Forgive for my mistake.

    ReplyDelete

Thank you for your comment.