Saturday, January 7, 2012

కారల్‌ మార్క్స్ ‌, Carl Marx



  • image source : Wikipedia.org

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ - కారల్‌ మార్క్స్ ‌, Carl Marx- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


కారల్‌ మార్క్స్‌ మే 5, 1818వ సంవత్సరంలో కారల్‌ మార్క్స్‌ జర్మనీలోని యూదు కుటుంబంలో జన్మించాడు. 1841 తరువాత లుడ్విగ్‌ ఫొయెర్‌ బ్యాక్‌ ప్రభావంతో భౌతికవాదిగా మారాడు. పారిస్‌లోని విప్లవోద్యమంలో పాల్గొన్నాడు. జర్మనీ మార్క్స్‌ను దేశం నుండి బహిష్కరించింది. 1845లో ఫ్రాన్స్‌ కూడా మార్క్స్‌ను వెలివేసింది. తరువాత మార్క్స్‌ బెల్జియం వెళ్లాడు. పాత సోషలిస్ట్‌ సంస్థలన్నీ కలిసి 1847 లో ‘కమ్యూనిస్ట్‌ లీగ్‌’గా ఏర్పడ్డాయి. ఎంగెల్స్‌తో కలిసి ఆ సంస్థకు ఎజెండాగా 1848 నాటికి కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఫ్రాన్స్‌, జర్మనీల్లో రాచరికాల మీద తిరుగు బాట్లు పెల్లుబికాయి. బెల్జియం కూడా మార్క్స్‌ ను దేశం నుంచి బహిష్కరించింది. చివరకు మార్క్స్‌ లండన్‌ చేరుకుని 1859లో ‘ఆర్థిక శాస్త్ర విమర్శ’ అనే గ్రంధాన్ని రాశాడు. ‘పెట్టుబడి’ (క్యాపిటల్‌) నాలుగు భాగాలుగా రచించాడు. 1864లో మార్క్స్‌ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌) ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాలు పెంపొందించడానికి దోహదం చేశాడు. మార్చి 14, 1883న మార్క్స్‌ మరణించాడు

For full details ... see Wikipedia.org కారల్‌ మార్క్స్ ‌, Carl Marx
  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thank you for your comment.