Friday, April 19, 2013

Sir Arthur Cotton,సర్‌ ఆర్థర్‌ కాటన్‌


  •  

  •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -సర్‌ ఆర్థర్‌ కాటన్‌ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

మే 15వ తేదీ 1803లో జన్మించిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్‌గా నియమించింది. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై అది 9 అడుగులు పూర్తి అయిన తర్వాత వరదలు వచ్చి 22 గజాల మేరకు కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో తనకు అప్పగించిన ఆనకట్ట పనిని పూర్తిచేసి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేశాడు. అందుకే ఆయనను ఆంధ్రులు మరచిపోలేక ఆయన విగ్రహాన్ని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసి అపర భగీరథుడిగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ.

For more details -> Sir Arthur Cotton in Telugu
  • ==========================
 Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thank you for your comment.