Friday, April 18, 2014

Gabriel García Márquez


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . ప్రపంచానికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -నోబెల్‌ గ్రహీత గాబ్రియెల్‌ గార్షియా మార్క్వెజ్‌- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


 ప్రఖ్యాత స్పానిష్‌ రచయిత, నోబెల్‌ సాహిత్య బహుమతి గ్రహీత గాబ్రియెల్‌ గార్షియా మార్క్వెజ్‌ 17 -04-2014 న కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. లాటిన్‌ అమెరికా సమాజానికి చెందిన పలు కోణాలను ప్రపంచం ముందు ఆవిష్కరించిన మార్క్వెజ్‌ను మార్క్‌ ట్వైన్‌, చార్లెస్‌ డికెన్స్‌ తదితర ప్రముఖ రచయితల సరసన చేరుస్తారు అభిమానులు. సాహితీ ప్రపంచం గాబొ అని ప్రేమగా పిలుచుకునే మార్క్వెజ్‌ కొలంబియాలో పుట్టిపెరిగారు. ఆయన రాసిన 'వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌' అనే రచన 25 భాషల్లోకి అనువదితమవడమే కాక 50 మిలియన్‌ ప్రతులకు పైగా అమ్ముడై చరిత్ర సృష్టించింది. సెర్వాంటిస్‌ 'డాన్‌ క్విక్జోట్‌' తర్వాత స్పానిష్‌ చరిత్రలో అంతగొప్ప నవల మళ్లీ ఇదేనని విమర్శకులు ప్రశంసించారు. ఈ నవలకే నోబెల్‌ బహుమతి కూడా లభించింది.
  • ========================================
Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thank you for your comment.